హైదరాబాద్, నమస్తే తెలంగాణ: గతేడాది మాదిరే ఈ యేడాది కూడా పత్తికి మద్దతు ధరతో కొనుగోలు చేసేందుకు సీసీఐ అంగీకారం తెలిపిందని వ్యవసాయశాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి తెలిపారు. నియంత్రిత సాగులో భాగంగా ఈ యేడాది అధికంగా పత్తి ఉత్పత్తి అవుతుందన్నారు. 2020-21కి సంబంధించి పత్తి కొనుగోళ్లపై జిన్నింగ్ మిల్లుల యాజమాన్యాలతో సీసీఐ సీఎం డీ ప్రదీప్ కుమార్ అగర్వాల్‌తో కలిసి వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్‌రెడ్డి సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ఈ యేడాది తెలంగాణలో మొత్తం పత్తి పంటను మద్దతు ధరకు కొనుగోలు చేసేందుకు సీసీఐ సీఎండీ ప్రదీప్ కుమార్ అగర్వాల్ హామీ ఇచ్చినట్లు తెలిపారు. ఈ సారి వానాకాలంలో రాష్ట్రం లో 58.69 లక్షల ఎకరాల్లో పత్తి సాగవుతున్నదన్నారు. 2020-21లో మద్దతు ధరకు కొనుగోలుకు గానూ రాష్ట్రంలోని 314 జిన్నింగ్ మిల్లులను పత్తి కొనుగోలు కేంద్రాలను ప్రకటించేందుకు తగిన చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. జీఎస్టీ సమస్యలపై సీసీఐ బాధ్యత తీసుకొని సమస్యను పరిష్కరించాలని జిన్నింగ్ మిల్లుల యాజమాన్యాలు కోరాయి. గతేడాది మాదిరిగానే జిన్నింగ్ మిల్స్ అసోసియేషన్ ఈసారి పత్తి కొనుగోళ్లకు సహకరించాలని కోరారు. సమావేశంలో వ్యవసాయ శాఖ కార్యదర్శి జనార్దన్‌రెడ్డి, మార్కెటింగ్ శాఖ డైరెక్టర్ లక్ష్మీబాయి, సీసీఐ రాష్ట్ర బాధ్యులు పాణిగ్రహి, జిన్నింగ్ అసోసియేషన్ అధ్యక్షుడు రవీందర్‌రెడ్డి, కార్యదర్శి రమేష్ పాల్గొన్నారు.
పత్తికి సీసీఐ మద్దతు ధర
Shailendra | 22 Aug 2020 10:50 AM GMT
X
X
Updated : 2020-08-26T18:18:15+05:30
Next Story
© 2017 - 2018 Copyright Telugu70MM. All Rights reserved.
Designed by Hocalwire