Home > మీడియా > రెండేళ్ల‌లోపే కోవిడ్ క‌నుమ‌రుగు : డ‌బ్ల్యూహెచ్‌వో

రెండేళ్ల‌లోపే కోవిడ్ క‌నుమ‌రుగు : డ‌బ్ల్యూహెచ్‌వో

రెండేళ్ల‌లోపే కోవిడ్ క‌నుమ‌రుగు : డ‌బ్ల్యూహెచ్‌వో
X

హైద‌రాబాద్‌: రెండేళ్ల లోపే క‌రోనా వైర‌స్ సంక్షోభం ముగిసే అవ‌కాశాలు ఉన్న‌ట్లు ప్ర‌పంచ ఆరోగ్య సంస్థ చీఫ్ టెడ్రోస్ అథ‌న‌మ్ గేబ్రియాసిస్ తెలిపారు. 1918లో వ‌చ్చిన స్పానిష్ ఫ్లూ కూడా అంతం అయ్యేందుకు రెండేళ్లు ప‌ట్టింద‌న్నాడు. ప్ర‌స్తుతం ఉన్న టెక్నాల‌జీ, జ‌నాల మ‌ధ్య క‌నెక్టివిటితో వైర‌స్ తొంద‌రగా వ్యాప్తి అయ్యే అవ‌కాశాలు ఉన్న‌ట్లు ఆయ‌న వెల్ల‌డించారు. అదే విధంగా ప్ర‌స్తుతం మ‌న ద‌గ్గ‌ర ఉన్న సాంకేతికత‌, ప‌రిజ్ఞానం కూడా వైర‌స్‌ను నియంత్రించ‌గ‌ల‌వ‌న్నారు. ఉత్త‌మ టెక్నాల‌జీ అందుబాటులో ఉన్న కార‌ణంగా.. రెండేళ్ల‌లోపే క‌రోనా వైర‌స్ క‌నుమ‌రుగ‌య్యే అవ‌కాశాలు ఉన్న‌ట్లు ఆయ‌న అభిప్రాయ‌ప‌డ్డారు. జెనీవాలో మాట్లాడుతూ టెడ్రోస్ ఈ విష‌యాల‌ను వెల్ల‌డించారు. వైర‌స్ నియంత్ర‌ణ‌లో జాతీయ ఐక్య‌త‌, ప్ర‌పంచ దేశాల సంఘీభావం కావాల‌న్నారు. ప్ర‌స్తుతం అందుబాటులో ఉన్న అన్ని విధానాల‌తో వైర‌స్‌ను నియంత్రించాలని, వ్యాక్సిన్ తోడైతే ఇంకా బాగుంటుంద‌న్నారు. ప్ర‌పంచ‌వ్యాప్తంగా వైర‌స్ వ‌ల్ల సుమారు రెండు కోట్ల 20 ల‌క్ష‌ల మంది వైర‌స్ బారిన‌ప‌డ్డారు. 793382 మంది మ‌ర‌ణించారు.

Updated : 2020-08-26T18:18:15+05:30
Next Story
Share it
Top